- ఎంపీడీవో శ్రీనివాస్ కి గ్రామస్తులు వినతి
నేటిసాక్షి, గన్నేరువరం, ( బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండలం లోని యాస్వాడా గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఉపాధి ద్వారా పనిచేసిన కూలీలు ఉపాధి కార్డు ద్వారా వ్యవసాయ కూలీలకు జీవన భృతి మంజూరులో రెగ్యులర్ గా పనిచేసిన వారిలో కొంతమంది పేర్లు మార్చి ఉపాధి కూలీలు పనిచేయకుండా వారికి జాబ్ కార్డు లో ఉన్న వారి పేర్లు జాబితా లో వచ్చిందని ఆ గ్రామంలో ఉపాధి హామీ మేటీ ని సరిగా పనిచేయడం లేదని జాబితా సరిగా లేదని మేటీను తొలగించాలని గురువారం గన్నేరువరం ఎంపీడీవో శ్రీనివాస్ కి వినతి పత్రం ఇచ్చినట్లు ఆ గ్రామ ప్రజలు తెలిపారు. ఊరి ప్రజల నిర్ణయం తీసుకుని కొత్త మే టిని నియమించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మామిడిపెళ్లి లక్ష్మణ్, వి.సతీష్, బాలయ్య, అంజయ్య, అనిల్, చిగురు సంజీవ్ చిగురు హరిక్, ఎం. అంజయ్య, జి. నర్సయ్య పాల్గొన్నారు.





