Friday, March 13, 2026

గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలో జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో కలెక్టర్ సమావేశ మందిరంలో డిసిపి ఎ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావుతో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో జరగనున్న వేడుకలను అధికారులు సమన్వయంతో కృషి చేసి విజయవంతం చేయాలని తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన వారి జాబితా సిద్దం చేయాలని, జిల్లా గ్రామీణాభివృద్ధి, సంక్షేమ, వ్యవసాయ- ఉద్యానవన, గ్రామీణ నీటి సరఫరా మిషన్ భగీరథ, అటవీ, విద్య, బ్యాంకింగ్, పశు వైద్య శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించి సాధించిన ప్రగతి వివరాలతో స్టాళ్ళు ఏర్పాటు చేయాలని, ప్రసంగ ప్రతి, దేశభక్తి గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాలు ఇతరత్రా అన్ని కార్యక్రమాల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. పురపాలక సంఘాల అధికారులు వేడుకలలో త్రాగునీరు, పారిశుద్ధ్యం ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అధికారులు, అనధికారులు, ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, ప్రశంసా పత్రాల గ్రహీతలు, ప్రజలు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రశంసా పంపిణీ, పతాక ఆవిష్కరణ, వేదిక అలంకరణ, పుష్పగుచ్చాలు, వేదిక తయారీ, టెంట్, కుర్చీలు, సౌండ్ సిస్టమ్, మైక్, ప్రోటోకాల్ ప్రకారంగా ప్రముఖుల ఆహ్వానం, నిరంతర విద్యుత్ సరఫరా, అత్యవసర ఏర్పాట్లు, అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేసే దిశగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News