Friday, March 27, 2026

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని వినతి

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు): హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇట్టి డంపింగ్ యార్డ్ ను హుజురాబాద్ లో నెలకొల్పుటకు ఏర్పాటు చేయుట గూర్చి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినారని తెలిసినది. ఇట్టి ప్రతిపాదనలను ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇట్టి డంపింగ్ యార్డ్ హుజురాబాద్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేస్తే హుజురాబాద్ పరిసర ప్రజలు హుజరాబాద్ పట్టణ ప్రజలు అస్తమా పేషెంట్లుగా మారి క్యాన్సర్ పేషెంట్లుగా మారి ఇబ్బందులకు గురి అవుతారని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇట్టి డంపింగ్ యార్డ్ ను విరమించుకోవాలని కమిషనర్ గారికి విన్నవించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బీసీ కులగనన మండల కన్వీనర్ మార్త రవీందర్ వేల్పుల ప్రభాకర్ ప్రజా సంఘాల నాయకులు పర్యావరణ కమిటీ అధ్యక్షులు.ఖాళీ దూసేన్ అంబేద్కర్ జయంతికమిటీ అధ్యక్షులు. ఉప్పు శ్రీనివాస్ పూలే జయంతి కమిటీ అధ్యక్షులు.గడిపే రాజు స్వేరో నెట్వర్క్ రాష్ట్ర కన్వీనర్ కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులుమీడియా కన్వీనర్ తులసి లక్ష్మణమూర్తి పెండ్యాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News