Friday, March 20, 2026

మాలల సమస్యలపై ఆర్డివోకు వినతి

నేటి సాక్షి, మెట్ పల్లి (గోరుమంతుల నరేందర్) : మాల సంఘాల ఆధ్వర్యంలో తమ సమస్యలపై శుక్రవారం మెట్ పల్లి ఆర్డివోకు వినతి పత్రం సమర్పించారు.మాల సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ మాలలకు వర్గీకరణ వల్ల జరిగే నష్టం వివరాల తో పార్క్ లో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్లను తెలియజేస్తూ 2011 తర్వాత నుండి పెరిగిన మాలల జనాభా లెక్కలు తీయకపోవడం అలాగే షమీం అత్తర్ కమిషన్ రిపోర్టును బహిర్గతం చేయకుండా వర్గీకరణ చేయడం జరిగిందన్నారు. అలాగే దళిత బంధు ఇతర ఎస్సీ కార్పొరేషన్ పథకాల వల్ల ఎవరికి ఎంత లాభం జరిగింది అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం డాటా సేకరించకుండానే వర్గీకరణ చేయడం వల్ల మాలలకు అన్యాయం జరిగిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ సమగ్ర సర్వే బహిర్గతం చేయలేదని, ఎస్సీ జనాభా కుల గణన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీలకు పంజాబ్ తరహా ఇరవై రెండు శాతం రిజర్వేషన్ పెంచాలని అలాగే ఎస్సీ మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు అధిక నష్టం జరుగుతుంది ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పొట్ట రాజేశ్వర్,గోరుమంతుల మారుతి,గోరుమంతుల సురేందర్, పొట్ట ప్రసాద్, నేరెళ్ల నరేష్, బూరం ఆంజనేయులు, అసతి శివ, బత్తుల భరత్, బత్తుల నరేష్, భూరం నరేష్, కంభ శంకర్, సల్లం గోపాల్, మ్యాకల శివ,బాల్క శంకర్, మద్దెల నితిన్, అమ్ముల ప్రవీణ్, పరుస శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News