Sunday, March 29, 2026

కోరుట్ల సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు పరిష్కారిఃచాలని ఆర్డివో కు వినతి

  • ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్

నేటి సాక్షి – కోరుట్ల (రాధారపు నర్సయ్య) : కోరుట్ల ప్రజల అకాంక్షలు నెరవేర్చడంలో పాలకులు పరిపూర్ణత ప్రదర్శించాలని సమస్యల పరిష్కారం లో జాప్యం చేయకుండా తగు సమయంలో న్యాయం చేయాలని కోరుతూ కోరుట్ల డెవలప్మెంట్ ఫోరమ్ నేత, జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ఆర్డీవో దివాకర్ రెడ్డి ని కోరారు. గురువారం కోరుట్ల లో ఆర్డీవో ను కలిసిన సందర్భంగా పలు అంశాలపై వినతి సమర్పించిన నాయకులు అర్హత కలిగిన నిరుపేదలకు ఇండ్ల సౌకర్యం కల్పించాలని, చెరువులు, కుంటలు కాపాడాలని కబ్జా స్థలాలు పరిరక్షించేందుకు కృషి చేయాలని పేట భాస్కర్ కోరారు. ఈకార్యక్రమంలో కోరుట్ల డెవలప్మెంట్ ఫోరమ్ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎలిశేట్టి గంగారెడ్డి, నాయకులు ఇట్యాల రాజేందర్, ముజాయిద్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News