Monday, March 16, 2026

మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వినతి

  • జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మ్యాకల పరశురాం

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ) : మహిళలకు సత్వర న్యాయం,మహిళలపై జరిగే నేరాలను నిరోధించడం కోసం మహిళ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం, జిల్లా అధ్యక్షులు మ్యాకల పరశురాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు శుక్రవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మ్యాకల పరశురాం మాట్లాడుతూ.. జిల్లాలో మహిళలపై నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయని, ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రస్తుతం ఉన్న పోలీసు స్టేషనలో మహిళాలకు మౌలిక సదుపాయాలు సరిపోవడం లేదని, అలాగే ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ ఉంటే మహిళలకు సంబంధించిన సమస్యలను స్వేచ్ఛగా వివరించడానికి,అలాగే మహిళ పోలీస్ స్టేషన్ ఉంటే గృహహింస మరియు వేధింపుల గురి అయ్యే సంఘటనలను వివరించడానికి, మహిళలు ముందుకు వస్తారని, అలాగే మహిళల భద్రత మరియు భద్రతకు భరోసా ఇవ్వాలనే ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా మహిళా పోలీస్ స్టేషన్ జిల్లాలో ఏర్పాటు చేస్తే మహిళలకు సత్వర న్యాయంతో పాటు, ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, వీలైనంత త్వరగా రాజన్న సిరిసిల్లా జిల్లా లో మహిళా పోలీస్ స్టేషన్‌ ఏర్పాటు కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో..జిల్లా ఉపాధ్యక్షులు బిళ్ళ వెంకట్రాములు, కోనరావుపేట మండల్ ప్రెసిడెంట్ కీసరి శ్రీనివాస్, రుద్రంగీ మండల అధ్యక్షులు మీసాల మల్లేష్ పటేల్, జాయింట్ సెక్రటరీ బోయిని శ్రీనివాస్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News