నేటి సాక్షి,రామడుగు:
రామడుగు మండలంలో గత కొద్ది నెలల నుండి స్థానిక ఎమ్మార్వో కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్సీ కమిషనర్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ కు రామడుగు మండల బేడ బుడగ జంగం(ఎస్సీ) కులస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి రామడుగు మండలంలోని వివిధ గ్రామాలలో నివసిస్తున్నామని అప్పటినుండి నేటి వరకు కుల ధ్రువీకరణ పత్రాలు పొందుతూ వస్తున్నామని గత కొన్ని నెలల నుండి రామడుగు ఎమ్మార్వో కుల దృవీకరణ పత్రాల జారీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని దీనిపై గతంలో కూడా ఆర్డీవో, కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన నేటికీ చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇప్పటికైనా కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో ఎటువంటి లోటు పాటు లేకుండా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు.