Thursday, April 2, 2026

అంబేద్కర్ జయంతికి ఏర్పాట్లు చేయాలనీ కమిషనర్ కు వినతి

నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : వచ్చే నెలలో జరగనున్న అంబేద్కర్ జయంతి కి తగిన ఏర్పాట్లు చేయాలనీ సోమవారం కోరుట్ల నియోజకవర్గం ఎస్సి, ఎస్టీ జె ఏ సి నాయకులు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి జరగనున్న నేపథ్యంలో పట్టణంలోని ఆరు అంబేద్కర్ విగ్రహాలకు రంగులు వేయించాలని మున్సిపల్ కమిషనర్ టి.మోహన్ కు వినతి పత్రం ఇచ్చినట్లు కోరుట్ల నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు బర్ల సాయన్న తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు బాల్క శంకర్రావు, బడే లక్ష్మణ్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News