Wednesday, March 11, 2026

బీసీ ఉద్యోగస్తులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలి

  • కలెక్టర్ కార్యాలయంలో ఏవో రాజేశ్వర్ కు వినతి

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- బీసీ ఉద్యోగస్తులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఏవో రాజేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ కేంద్రస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలలో అన్ని కేటగిరీలలో కలిపి బీసీలు 11 శాతం మాత్రమే ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయని, కేంద్రంలోని 54 లక్షల ఉద్యోగాలలో కేవలం 4 లక్షల 62 వేలు మాత్రమే మండల కమిషన్ సిఫార్సుల ప్రకారం 32 సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించి ఉన్నప్పటికీ బీసీలకు11 శాతం కూడా వాటా లేదని అన్నారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెడితే తప్ప బీసీల ప్రాతినిధ్యం పెరిగేది నిజమని రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 క్లాజ్ 4ఎ ప్రకారం జనాభా ప్రాతినిధ్యం లేకపోతే ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని పలు సందర్భాలలో కోర్టులు చెప్పాయని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెడితే తప్ప బీసీలకు న్యాయం జరగదన్నారు. ఇప్పటికైనా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శాఖ పురి భీంసేన్, నాయకులు మాడిశెట్టి వెంకటేష్, బోరే రాజయ్య లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News