
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ లోని స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో రిటైర్మెంట్ ఆర్టీసీ కార్మికుల సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రిటైర్మెంట్స్ సంగం రాష్ట్ర అధ్యక్షుడు బి. రాజయ్య, హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఆర్. చారి పాల్గొన్నారు. ఈ సమావేశానికి మార్త రవీందర్ అధ్యక్షత జరిగిన సమావేశంలో బి. రాజయ్య మాట్లాడుతూ త్వరలో రిటైర్మెంట్ సంఘం రాష్ట్ర మహాసభలు ఈనెల నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను, ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తూ రిటర్మెంట్ కార్మికులకు రావాల్సిన 2017 పే స్కేల్ బకాయిలు మరియు వృద్ధాప్యంలో ఉన్న కార్మికులకు సూపర్ లగ్జరీలో కూడా ఫ్రీగా అనుమతించాలని మంత్రిని కోరుతామని, ఎండి సర్జనార్ కి విన్నవించినా ఫలితం లేదని, అందుకే సమావేశం నిర్వహించి పలు సమస్యలు లీవ్ ఇన్క్యాస్మెంట్ పైసలు, ఆరోగ్య సమస్యలు, పేషెంట్లకు ఇచ్చే మందులు రెండు నెలల కొకసారి ఇవ్వవలసిందిగా డిమాండ్ చేశారు. అయ్యర్ పింఛన్ సమస్యలు, ఇంకా పలు సమస్యలపై చర్చించి మహాసభను నిర్వహించి సభను విజయవంతం చేయవలసిందిగా రిటైర్మెంట్ కార్మికులందరినీ ఆహ్వానించారు. అనంతరం అధ్యక్షులు రాజయ్యను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేల్పుల ప్రభాకర్, ట్రెజరర్ పాండారి, ఇవిఆర్ నరసయ్య, వి ఆర్ రావు, పి సమ్మిరెడ్డి, బోడ మల్లయ్య, మండల కనకయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు





