- నూతన సబ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
నేటి సాక్షి, ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : శనివారం గద్వాల నియోజకవర్గం కె.టి దొడ్డి మండలం పరిధిలో మల్లా పురం తాండా సమీపంలో సిద్దోని పల్లి గ్రామంలో నూతన సబ్ స్టేషన్ ను ప్రారంభించిన ముఖ్య అతిథి గా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి హాజరయ్యారు. మల్లాపురం తాండా సమీపంలో సిద్దోని పల్లి గ్రామానికి సంబంధించిన 83 లక్షలు రూపాయలు వ్యయం 33/11 కెవి నిర్మాణం చేసిన సబ్ స్టేషన్ ను ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగినది. ఎమ్మెల్యే కి అధికారులు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో గద్వాల ప్రాంతంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు రైతులు కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారు కరెంటు లేక సరైన పంటలు లేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునేవారు. గతంలో పాలించిన నాయకులు గ్రామాలలో సరిగ్గా విద్యుత్ లేక ఎంతోమంది ఇబ్బందులను పడేవారు. రైతులైతే పంట పొలాల పండగ కాక సరైన నీళ్లు వసతి లేక ఎన్నో ఇబ్బందులు పడి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవాడు అని పేర్కొన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచి నప్పటి నుండి ఈ ప్రాంతంలోని రైతుల యొక్క కష్టాలను తీర్చాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యంగా తాగునీరు విద్యుత్తు వంటి సమస్యలతో ఎంతోమంది రైతులు ఇబ్బంది పడుతున్నారని విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలంలో ట్రాన్స్ఫారంలు పంపిణీ చేయడం జరిగింది. రైతులకు నీటి సమస్యను విద్యుత్ సమస్యను లేకుండా కొంతమేరకు పరిష్కరించడం జరిగిందని తెలిపారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం గారి, విద్యుత్ శాఖ మంత్రివర్యులు నేతృత్వంలో రైతులకు 24 గంటల కరెంటు రెండు పంటలకు చివరి ఆయకట్టు వరకు నీటిని అందజేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గం ప్రజలకు కరెంట్ అందజేస్తూ త్వరలోనే కొన్ని గ్రామాలకు సబ్ స్టేషన్లు మంజూరు కావడం జరిగింది. త్వరలోనే వాటిని కూడా సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసుకొని గ్రామాలలో లో వోల్టేజ్ సమస్యలను లేకుండా చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో కరెంటు లేకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సమన్వయంతో విద్యుత్తును ఉపయోగించుకోవాలని కోరారు విద్యుత్ అధికారులకు శ్రమకు విలువ కట్టలేదని ఏ ఒక్క చిన్నగా విలువైన వ్యాపార సంస్థ అయిన పెద్ద ఇండస్ట్రీ అయిన ప్రతిదానికి కరెంటు ఉండాల్సిందే కాబట్టి కరెంటు అధికారులు అనునిత్యం పనిచేయడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో కరెంటు పోవడంతో ప్రజలు అధికారులను ప్రజాప్రతిని తప్పుగా అర్థం చేసుకుంటారు. వారి సమస్యలను అర్థం చేసుకొని వారికి సహకరించాలని కోరారు. భవిష్యత్తులో గద్వాల నియోజకవర్గంలో ఏ ఈ గ్రామంలో కూడా లో వోల్టేజ్ కరెంటు లేకుండా చూసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మరికొన్ని గ్రామాలకు సబ్ స్టేషన్లు ట్రాన్స్ఫారం లో తీసుకువచ్చే విధంగా నా సాయ శక్తుల కృషి చేస్తానని తెలిపారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు మీ అందరి ఆశీస్సులతో మరొక్కసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందు కు నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ చైర్మన్ బోయ వెంకటరాములు, జిల్లా విద్యుత్ శాఖ అధికారి, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, మండల విద్యుత్ శాఖ అధికారులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామకృష్ణారెడ్డి, నాయకులు చక్రధర్ రావు, వెంకన్న గౌడ్, ఆంజనేయులు చంద్రశేఖర్, తిమ్మప్ప, తిక్క, గోపి, సురేష్ నాయక్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





