Friday, March 20, 2026

ఉపాధి హామీ పనుల పై సమీక్ష సమావేశం

  • పాల్గొన్న అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు

నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని శుక్రవారం రోజున అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు కమలాపూర్ మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు మరియు ఉపాధి హామీ సిబ్బందికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండెబాబు ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీ కార్యదర్శులకు మరియు ఉపాధి హామీ సిబ్బందికి తగిన సూచనలుచేసారు. నేటి నుంచి ప్రతి గ్రామములో కనీసం 30 మంది కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని అదేవిధంగా ఉపాధి భరోసా కింద అనుమతి పొందిన క్యాటిల్ షెడ్లు,నాడేం కంపోస్ట్ పిట్స్, పొలం బాటలు, సిసి రోడ్లు,గ్రామపంచాయతీ నిర్మాణాలు, పండ్ల తోటల పెంపకం మొదలైన పనులన్నింటినీ మార్చి 25 లోగా పూర్తి చేసి,వాటికి సంబంధించిన చెల్లింపులు అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఆ గ్రామంలో వన మహోత్సవం కింద నాటిన మొక్కల్లో తప్పనిసరిగా 85% మొక్కలు బతికి ఉండే విధంగా చూసుకోవాలని, గ్రామాలలో రోడ్ల కిరువైపున నాటిన మొక్కలన్నిటికీ ప్రతి శుక్రవారం విధిగా అన్ని మొక్కలకు నీరు అందించాలని సూచించారు. క్షేత్ర సహాయకులు రోడ్డుకి ఇరువైపున నాటిన మొక్కలకు పశువుల నుండి రక్షించే విధంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఒక వాచర్ను నియమించి వాటి సంరక్షణ చూసుకోవాలని ఆదేశించించారు. సాంకేతిక సహాయకులు తమకు సంబంధించిన గ్రామాలలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా నీరు పోయించిన వెంటనే అట్టి ఫోటోలు, లాగ్ బుక్కులు సేకరించుకొని ప్రతి నెల చివర వాటికి సంబంధించిన చెల్లింపులు పూర్తి చేయాలని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కింద నిర్దేశించినటువంటి పని దినాలను తప్పనిసరిగా ఈ ఆర్థిక సంవత్సరము మార్చి 31 వరకు విధిగా పూర్తి చేయాలని, లేని వారిపై కఠిన చర్యలు తీసుకొనబడునని, ఉపాధి హామీ సిబ్బంది విధిగా ఉదయన్నె గ్రామాలలో పర్యటించి కూలీలకు అవసరమైన పనులు గుర్తించి, వారికి పనులు కల్పించే విధంగా చర్యలు గైకొనాలని,
మండలంలో మంజూరైన వ్యక్తిగత మరుగుదొడ్లన్నీ వారం రోజుల లోపల పూర్తి చేయించాలని పంచాయతీ కార్యదర్శులను కోరారు.
అదేవిధంగా హార్టికల్చర్ లో భాగంగా ఉపాధి హామీ పథకంలో ప్రతి గ్రామంలో కనీసం ఐదు ఎకరాల పండ్ల తోటలు పెంపకం చేయాలని,
ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలో భాగంగా 20 రోజుల కంటే తక్కువ పని చేసిన భూమిలేని నిరుపేదలకు మొదట 20 రోజులు నిండే విధంగా పని కల్పించాలని క్షేత్ర సహాయకులను ఆదేశించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సిహెచ్.రవి,ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి,జిల్లా టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్,స్వచ్ఛ భారత్ మిషన్ అధికారి సంపత్ గారు,పంచాయతీ కార్యదర్శులు మరియు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News