Saturday, March 21, 2026

బీ.సీ సహకార రుణాలపై రేపు బ్యాంకర్లతో సమీక్ష సమావేశం

ఆళ్లగడ్డ ప్రతినిధి, నేటి సాక్షిన్యూస్ : ఆళ్లగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం బీసీ సహకార రుణాలపై బ్యాంకింగ్ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆళ్లగడ్డ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మహబూబ్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బీసీ, ఈ బీసీ రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించి స్కూటీని కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మండలంలో బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తమ ధ్రువపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
బ్యాంకు అధికారులు సంతృప్తి చెందిన లబ్ధిదారులకు రుణాలు మంజూరు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో మహబూబ్ ఖాన్ వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News