- జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండల అధ్యక్షులుగా ఎం. హనుమంతు
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండల అధ్యక్షులుగా ఎం. హనుమంతు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఈడిగ మహేష్ గౌడ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈడిగ మహేష్ గౌడ్ ఎం. హనుమంతు కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హనుమంతు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో గద్వాల జిల్లా కేటి దొడ్డి మండల అధ్యక్షులుగా నియమించిన జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్ కు, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం కు కృతజ్ఞతలు తెలిపారు. నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించి పౌరులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్ సహాయకులు పరిసరాం మరియు ఇతరులు పాల్గొన్నారు.





