Friday, March 20, 2026

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ

  • వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బి. దర్గేష్ నియామకం

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బి.దర్గేష్ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు డాక్టర్. చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఈడిగ మహేష్ గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈడిగ మహేష్ గౌడ్ బి. దర్గేష్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దర్గేష్ మాట్లాడుతూ… తనపై నమ్మకంతో వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన జాతీయ అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్ కు, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం కు కృతజ్ఞతలు తెలిపారు. నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించి పౌరులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News