నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) :
జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న గుడిపాటి వీణవాణి పై చర్యలు తీసుకోవాలని చేసిన ఫిర్యాదు పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంఈఓ జూలపల్లి, వడ్కాపూర్ హెచ్.ఎం.రమేష్, డిఈఓ పెద్దపల్లి పైన చర్యలు తీసుకోవాలని అమరగాని ప్రదీప్ చేసిన ఫిర్యాదు పైన విచారణ చేసి నివేదిక సమర్పించాలని వరంగల్ ఆర్.జె.డి ఆర్జెడి (ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, పాఠశాల విద్య) జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. ఈ మేరకు అయన ఉత్తర్వులు జారీ చేశారు. గుడిపాటి వీణవాణి అక్రమాలపైన తాను ఆధారాలతో కంప్లైంట్ చేస్తే జూలపల్లి ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు రమేష్ నిర్లక్ష్యం చేయడమే కాకుండా, వీణావాణిని కాపాడేందుకు అనుకూలంగా వ్యవహరించి తప్పుడు నీవేదికను సమర్పించారని ఈ విషయమై ఆర్.జె.డి దృష్టికి తీసుకెళ్లగా విచారణకు ఆదేశించారని త్వరలోనే అక్రమార్కుల బాగోతం బట్టబయలు కానుందని అమరగాని ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.