ఈ ప్రాంతం పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్న చల్మెడ..
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ :
వేములవాడ ఆర్ఎంపి పి.ఎం.పి డాక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం ఆర్ఎంపీ క్లినికుల పైన రైడింగ్ చేసిన అధికారులపై శుక్రవారం చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ… ఆర్ఎంపీల పైన కావాలని ఆది శ్రీనివాస్ పై రైడింగ్ చేపిస్తున్నాడని తప్పుగా మాట్లాడడం జరిగిందని దానిని తీవ్రంగా వేములవాడ ఆర్ఎంపీలు తరుపున ఖండించారు. చెల్మెడ లక్ష్మీనరసింహారావు పూర్తిగా అవగాహన లేని అర్థనైతమైన మాటలు అని, ఆర్ఎంపి, పిఎంపీల మైన మాకు ఆది శ్రీనివాస్ ఎల్లప్పుడూ అండగా ఉంటూ అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నారని కావాలని వారి స్వార్థ రాజకీయం కోసం అవగాహన లేకుండా చెల్మెడ మాట్లాడారని పూర్తిగా తప్పుబట్టారు. గడిచిన 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఏమి చేయలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ట్రైనింగ్ ఇప్పించింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు చేదోడు వాదోడిగా ఉంటుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి రవీందర్, వెంకన్న, సోయినేని కరుణాకర్, వాసాల రాజేందర్, బాలయ్య, నరేందర్ శంకర్ నరసయ్య, దాసు వెంకన్న, సుధాకర్ అంజయ్య సుమారు 50 మంది ఆర్ఎంపి పిఎంపి లు పాల్గొన్నారు.





