Saturday, March 14, 2026

చవటగుంటలో రహదారి ఆక్రమణలు తొలగిస్తాం

  • చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

నేటి సాక్షి, ఉమ్మడి చిత్తూరు జిల్లా : వెదురుకుప్ప మండలం కేంద్రము కూడలి సమీపంలో ఉన్న చవటగుంట ప్రధాన రహదారిని ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించడానికి వెంటనే చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు వెదురుకుప్పం మండలంలో చవటగుంట కూడలి ఒక ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రోడ్డుకిరువైపులా ఆక్రమణలు పెరిగిపోయాయని, తిరుపతి చిత్తూరు దేవళంపేట పెనుమూరు పుత్తూరు అనుపల్లి చంద్రగిరి దారుల్లో బస్సుల రాకపోకలు పెరిగాయని, వీటికి తోడు ట్రాక్టర్లు ఆటోలు కార్లు ద్విచక్ర వాహనాలు అధికమైపోయినందువల్ల ఉదయం సాయంకాల సమయాల్లో అటు ఇటు ప్రజలు కదలిలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. పోలీసులు రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, పూర్తిస్థాయిలో ప్రయోజనం కలగడం లేదని, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని చవట గుంటలో జరిగిన రహదారి ఆక్రమణలను తొలగించవలసిందిగా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధికార ప్రతినిధి పరదేశి, వెదురుకుప్పం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందుకూరి హుమేష్ చంద్ తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News