Wednesday, March 11, 2026

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

  • ఎస్‌ఐ జె.కృష్ణారెడ్డి

నేటి సాక్షి, బెజ్జంకి:
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ జనవరి నెలను రోడ్ సేఫ్టీ మాసంగా ప్రకటించింది. ఈ క్రమంలో, బుధవారం బెజ్జంకి క్రాస్ రోడ్ వద్ద బెజ్జంకి పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ జె.కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండటం, సిగ్నల్ జంపింగ్ చేయకూడదని సూచించారు. అధిక వేగంతో వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. వాహనదారులు ప్రతిరోజు ట్రాఫిక్ నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు. రోడ్డు భద్రత ప్రాణాలను కాపాడటంతో పాటు ప్రమాదాల సంఖ్యను తగ్గించడంలో కీలకమని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపీడీవో ఆంజనేయులు, బెజ్జంకి పోలీసులు, స్థానిక ప్రజలు, వాహనదారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News