- చేర్యాల మార్కెట్ చౌరస్తాలో చేర్యాల సీఐ శ్రీను ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు
- ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి పాటల ద్వారా అవగాహన కల్పించడం
నేటి సాక్షి చేర్యాల: చేర్యాల సీఐ శ్రీను, మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని తెలిపారు. నాలుగు చక్రాల వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. ప్రమాదం చిన్నదైనా పెద్దదైనా దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. ఒక్క రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, కృంగదీస్తుందన్నారు. ఇంట్లో ఇంటి యజమాని రోడ్డు ప్రమాదంలో జరగరానిది ఏదైనా జరిగితే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే అవకాశం ఉంటుందన్నారు. మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రయాణికులు వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. అతివేగము రాంగ్ రూట్లో వాహనాలు నడపవద్దని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారధి బృందం సభ్యులు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు హెల్మెట్, సీట్ బెల్ట్, అధిక వేగము, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, తదితర అంశాల గురించి పాటల రూపంలో వాహనదారులకు ప్రజలకు అవగాహన కల్పించారు.





