నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పరకాల క్రాస్ రోడ్డు వద్ద నేషనల్ లారీ డ్రైవర్లకు రోడ్డు భద్రత మసోత్సవాలు సందర్భంగా హుజురాబాద్ వాహనముల తనిఖీ అధికారి కంచి వేణు మాట్లాడుతూ రోడ్లపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలని భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని హుజురాబాద్ వాహనముల తనిఖీ అధికారి కంచి వేణు అన్నా రు. వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు, కుటుంబ సభ్యులు తమ కోసం ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రమాదాల్లో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబమంతా రోడ్డు మీద పడుతుందని అన్నారు. వాహనం నడిపేటప్పుడు తప్పక జాగ్రత్తలు పాటించాలని సూచనలు ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, కార్లు నడిపేవారు సీటు బెల్టు పెట్టుకోవాలి అని, అతివేగం అనర్థదాయకమని, మద్యం తాగి వాహనం నడపొద్దని చెప్పారు. ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. ఈ విషయాలను ప్రతి వాహనదారులు గమనించాలి అని సూచించారు. ఎక్కువగా అధిక వేగంతో రోడ్డుపై వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని అన్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్క వ్యక్తి రూల్స్ ను పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకొని వాహనాలను నడపాలి అని సూచనలు ఇచ్చారు. ఈ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరికి వాటిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ నాగరాజు, హోంగార్డ్ గుర్రం శ్రీకాంత్ గౌడ్, లారీ డ్రైవర్లు పాల్గొన్నారు.

