- మోటారు వాహన తనిఖీ అధికారి జి. వంశీధర్..

నేటి సాక్షి ప్రతినిధి, చందుర్తి
వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని మోటారు వాహన తనిఖీ(ఎం. వి. ఐ )అధికారి జి వంశీధర్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా మోటారు వాహన తనిఖీ అధికారి జి. వంశీధర్ ఆధ్వర్యంలో చందుర్తి మండలకేంద్రంలో ద్విచక్ర వాహన దారులకు ఆటో రిక్షా డ్రైవర్లకు రోడ్డు భద్రతా, ప్రయాణంలో జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా అయన వాహనదారులతో మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.మద్యం సేవించి, మొబైల్ మాట్లాడుతూ, తోటి ప్రయానికులతో ముచ్చటిస్తూ డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. డ్రైవర్ సీట్ ఇరుపక్కల ప్రయానికులను కూర్చోపెట్టుకొవద్దని, డ్రైవర్లు యూనిఫార్మ్ ను ధరించాలని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయక మోటారు వాహన తనిఖీ అధికారి పృథ్విరాజ్ వర్మ, కానిస్టేబుల్ ప్రశాంత్ ప్రజలు పాల్గొన్నారు.






