- తొమ్మిదో వర్ధంతి నీలి నివాళులు
- డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్
నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఆధిపత్య దోపిడి కుట్ర సిద్ధాంతం పై ఎక్కు పెట్టిన ఏకలవ్వుడి విల్లంబు, వెలివాడల తొలిపొద్దు, భారతీయ మూలవాసుల ఆత్మ గౌరవ ధిక్కార పతాక రోహిత్ వేములని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్ కొనియాడారు. శుక్రవారం హన్మకొండ లో ఎర్పాటు చేసిన డిబిఎఫ్ కార్యకర్తల సమావేశంలో చుంచు రాజేందర్ మాట్లాడుతూ మనువాధుల కుట్రలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ లో చదువుతున్న దళిత నీలి సైనికుడు రోహిత్ వేముల బలై నేటికి తొమ్మిది సంవత్సరాల కావస్తున్న సందర్భంగా 9వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజును దేశ వ్యాప్తంగా మనువాద ఆధిపత్య భావజాలానికి వ్యతిరేక ప్రతిజ్ఞ దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మహానీయుల ఆలోచన విధానంతో రోహిత్ వేముల ఆశయాలను ముందుకు తీసుకు పోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర మహిళ నాయకురాలు బొర్ర సంపూర్ణ, జిల్లా కార్యదర్శి మేకల అనిత, డిబిఎఫ్ జిల్లా నాయకులు పోలేపాక మల్లేశం, రవి, సీనియర్ దళిత నాయకులు మాదాసి అబ్రహాం, రాజు తదితరులు పాల్గొన్నారు.





