- రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు పాటించాలి
- హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వాహనదారులకు గులాబీ పూలు ఇచ్చి విద్యార్థుల వినూత్న అవగాహన
- హుజురాబాద్ టౌన్ సిఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు):
ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని హుజురాబాద్ టౌన్ సీఐ తిరుమల గౌడ్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని… పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాల విద్యార్థుల సహకారముతో .. ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కల్పించారు. జమ్మికుంట-కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వస్తున్న వాహనా దారులను ఆపి గులాబీ పూలను ఇచ్చి..హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలంటూ వినూత్నంగా గులాబీ పూలు ఇచ్చి అవగాహన కల్పించారు. అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు అవే మనల్ని రక్షిస్తాయని.. విద్యార్థులు వాహనదారులకు సూచనలు చేశారు. అనంతరం సిఐ మాట్లాడుతూ విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ ను వివరించడం హర్షనీయమన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ నిబంధనల ప్రకారంగా వాహనాలను నడపాలని సూచించారు. అతివేగం అజాగ్రత్తగా నడిపి కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని సూచించారు. వాహనాల వెంట ధ్రువీకరణ పత్రాలు ఉండాలని, మద్యం సేవించడం ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం చేయరాదని సూచించారు.

