Tuesday, March 31, 2026

డబ్బులు వసూలు చేస్తున్న రౌడీ షీటర్ ముఠా అరెస్ట్

నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : మెట్‌పల్లి సర్కిల్ పరిధిలో ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూల్ చేసిన రౌడీ షీటర్ ముఠాను అరెస్ట్ చేసినట్లు సి.ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గత కొంత కాలం నుండి అక్రమ ఇసుక, మొరం రవాణా, భూమి సెటిల్‌మెంట్ దందాలు చేస్తూ, వారి అక్రమాల పై ఎదురు తిరిగిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్న అమాయక ప్రజలు, వ్యాపారాలు మరియు ప్రభుత్వ అధికారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న రౌడీ షీటర్ ముఠాను ఇబ్రహింపట్నం ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసినట్లు సిఐ పేర్కొన్నారు. నిందితుల వివరాలు తెలుపుతూ రెంజర్ల అజయ్, రాజేశ్వర్‌రాపేట్ గ్రామం, మెట్‌పల్లి మండలం.
బత్తుల భరత్,ఇందిరానగర్, మెట్‌పల్లి పట్టణం,జెట్టి లక్ష్మణ్ మున్నూరుకాపు దుబ్బవాడ, మెట్‌పల్లి కి చెందినవారు.మరో నిందితుడు ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్ రావు పేటకు చెందిన ఎన్నం రమేష్ పరారిలో ఉన్నట్లు తెలిపారు.వీరిలో బత్తుల భరత్ గతంలో వివిధ నేరాలకు పాల్పడగా అతని పై మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ తో పాటు ఇతర కేసులలో నిందితుడిగా ఉన్నాడు.గత నెల 12న రెంజర్ల అజయ్ రాజేశ్వర్‌రావ్ పేట్‌లో అక్రమ మొరం రవాణా చేస్తుండగా ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ డీఈఈ లక్కంపల్లి అరుణోదయ్ కుమార్ మరియు వర్క్ ఇన్‌స్పెక్టర్ లస్మయ్యలు అడ్డుకున్నారు. వెంటనే అజయ్ ఈ విషయాన్ని ఎన్నం రమేష్‌కు ఫోన్ ద్వారా తెలియజేయగా, రమేష్ అక్కడికి వచ్చి డీఈఈ అరుణోదయ్ కుమార్‌ను దూషించాడు.వారి అక్రమ రవాణాను అడ్డుకుంటే డీఈఈ అరుణోదయ్ కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని రమేష్ బెదిరించడంతో డీఈఈ అరుణోదయ్ కుమార్ భయపడి అక్కడి నుంచి పారిపోయారు.ఆ తర్వాత బత్తుల భరత్ డీఈఈ అరుణోదయ్ కుమార్‌కు ఫోన్ చేసి, కులం పేరుతో దూషించారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని, చంపుతామని బెదిరించి, కేసు పెట్టకుండా ఉండాలంటే మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అలాగే గత నెల 15న జెట్టి లక్ష్మణ్ కూడా డీఈఈ అరుణోదయ్ కుమార్‌కు ఫోన్ చేసి వెంకట్రావుపేట్ గుట్ట వద్దకు వచ్చి మాట్లాడాలని సమస్య పరిష్కరించుకోవాలని, లేకపోతే చంపుతామని బెదిరించారు. దీంతో భయపడిన డీఈఈ అరుణోదయ్ కుమార్ బత్తుల భరత్‌కు ఫోన్ ద్వారా రెండుసార్లు మొత్తం లక్షా పది వేలు పంపించారు. నలుబై వేలు నగదు రూపంలో జెట్టి లక్ష్మణ్‌కు ఇచ్చారు.అయిన మళ్ళీ వారు డీఈఈ అరుణోదయ్ కుమార్ కు ఫోన్ చేసి మిగతా లక్ష యాబైవేల రూపాయలు ఇవ్వాలని లేకపోతే చంపుతామని బెదిరింపులకి పాల్పడగా, వారి వేదింపులు తట్టుకోలేక డీఈఈ అరుణోదయ్ కుమార్ ఈ నెల 6వ తేదిన ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం చేసినట్లు సి ఐ తెలిపారు. ముగ్గురు నిందితులయిన అజయ్, భరత్,లక్ష్మణ్‌లు గండి హనుమాన్ టెంపుల్ సమీపం లో ఉన్నారని సమాచారం రాగ వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. వారి నుండి రెండు సెల్ ఫోన్‌లు ఎనబై వేల రూపాయల నగదు స్వాధీనపరుచుకొని వారిని కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.పరారీలో ఉన్న మరో నిందితుడు ఎన్నం రమేష్‌ను అతి త్వరలోనే పట్టుకొని కోర్టులో హాజరుపరుస్తామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News