Monday, March 30, 2026

రేవల్లి తాసిల్దార్ కార్యాలయ నిర్మాణానికి రూ. 32 లక్షల నిధులు మంజూరు

  • వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అభ్యర్థన మేరకు స్పందించిన అమాత్యులు
  • ప్రోసిడింగ్ జారీ చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : రేవల్లి మండల తాసిల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 32 లక్షల రూపాయలను మంజూరు చేసింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డిఅభ్యర్థన మేరకు స్పందించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ క్రమంలో శుక్రవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అందుకు సంబంధించిన ప్రొసీడింగ్ ను జారీ చేశారు. అడిగిన వెంటనే తాసిల్దార్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి సహకరించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News