Monday, March 16, 2026

టైరు పేలి పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

  • తృటిలో తప్పిన బస్సు ప్రమాదం
  • పలువురు ప్రయాణికులకు గాయాలు
  • క్షేత్రగాతులను పరామర్శించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ): ఆర్టీసీ బస్సు టైరు పగిలి, అదుపుతప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లో దిగబడడంతో, పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గోరంటాల గ్రామ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన AP29Z 1742 కామారెడ్డి నుండి కరీంనగర్ కి 52 మంది ప్రయాణికులతో బయలుదేరింది. గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామ శివారులోకి రాగానే బస్సు టైరు పగిలి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వెళ్ళింది. దీంతో పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. పంట పొలాల్లో ఉన్న రైతులు 108 కు సమాచారం అందివ్వగా, క్షేత్రగాతులను కామారెడ్డి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి, సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్సై శ్రీకాంత్, కామారెడ్డి డిపో మేనేజర్ ఇందిర సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

-క్షత్రగాతులను పరామర్శించిన కలెక్టర్..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి కలెక్టర్ ఆదేశించారు. ప్రమాద విషయం తెలుసుకుని కలెక్టర్ ఆసుపత్రికి చేరుకుని, క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలు ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News