Friday, March 13, 2026

నూతన గృహప్రవేశంకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : ప్రముఖ వ్యాపారవేత్త గణేష్ ప్రసాద్ రెడ్డి నూతనంగా నిర్మించిన ఇంటి గృహప్రవేశంకు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామక్రిష్ణారెడ్డి హాజరయ్యారు. చిత్తూరులోని కట్టమంచి వద్ద ఆదివారం జరిగిన నూతన గృహప్రవేశ మహోత్సవానికి వచ్చారు. ఆయనతో పాటు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు వైసీపీ ఇన్ చార్జి విజయా నందరెడ్డి, గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి సునీల్ కుమార్ తో పాటు తొండవాడ సర్పంచ్ మల్లం దీపికా రెడ్డి,జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు మల్లం చంద్రమౌళి రెడ్డి స్థానిక పార్టీ నేతలు అందరూ సజ్జలకు సాదర స్వాగతం పలికారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News