ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించండి
పెండింగ్ జీతాల కోసం కలెక్టరెట్ వద్ద భారీ ధర్నా చేస్తామని హెచ్చరిక

నేటిసాక్షి, కరీంనగర్:
ప్రభుత్వ ఆసుపత్రి షానిటేషన్, పెషేంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికుల పెండింగ్ జీతాలు ఇవ్వాలని కరీంనగర్ ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేసి సూపెరడెంట్ డాక్టర్ వీరరెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలలుగా జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నే కార్మికులకు జీతాలు పెండింగ్ లో ఉన్నాయని ఆరోపించారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి 542 బెడ్లకు బిల్లు రావాల్సి ఉండగా అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్యంగా లు కేవలం 330 బెడ్లకు మాత్రమే బిల్లులు వస్తున్నాయని అన్నారు. ఈ సమస్యపై గత ఐదు నెలలు క్రితం సమ్మె కూడా చేశామని సమస్య పరిస్కారం చేస్తామని ఆసుపత్రి సూపర్డెన్డ్ హామీ కూడా ఇచ్చారాని అన్నారు. కానీ ఎక్కడ సమస్య అక్కడే ఉన్నదాని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు రాకపోవడం వల్ల ఆసుపత్రి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదురకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి కిరాయి, కిరాణ సామాను, స్కూల్ ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ అన్నారు. కానీ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యాహరించడం దుర్మార్గమని అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఆర్థికశాఖ నుంచి 542 బెడ్లకు బిల్లు వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్మికులను అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరెట్ వద్ద భారీ ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు పి. అరుణ్, నాయకులు ఎస్. రాజు, శంకరమ్మ, అలీమ్, అంజలి, మమతా, మల్లేశం, నర్సింగం, విజయ , లత తదితరులు పాల్గొన్నారు.





