- గ్రామస్థాయి నుండి జాతీయస్థాయి క్రీడలకు
- ఆటాడిందంటే మెడల్స్ రావాల్సిందే
- తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల శిక్షణతో రాణిస్తున్న యువతి
- స్పాన్సర్స్ ముందుకు వస్తే మరిన్ని పథకాలు

నేటి సాక్షి, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలకేంద్రానికి చెందిన ముదిరాజ్ కుటుంబానికి చెందిన మౌటం శ్రీనివాస-రమ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె సంగీత ప్రస్తుతం స్థానిక మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. చిన్నతనం నుండే ఆటపాటల్లో రాణిస్తున్న సంగీత గత కొద్ది సంవత్సరాలుగా అథ్లెటిక్స్ హామర్, డిస్కతో, జావలింగ్ త్రోలో రాణిస్తూ ఎన్నోపథకాలు మెడల్స్ సాధించింది. గతంలో జాతీయస్థాయిలోనూ రాణించిన ఈ క్రీడాకారిని ప్రస్తుతం జరుగుతున్న sgf పోటీల్లో జిల్లాస్థాయి నుండి, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించింది. రాష్ట్రస్థాయిలో హామర్ విభాగంలో సెకండ్ ప్లేస్ లో, డిస్కస్ త్రో, జావలింగ్ త్రోలో మూడో ప్లేస్ లో నిలిచి పథకాలు రాణించగా, జార్ఖండ్లో జనవరి మొదటి వారంలో జరగబోయే జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో సత్తాచాటనుంది. రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్న యువతిని స్థానికులు అభినందిస్తుండగా, తల్లిదండ్రులు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. స్పాన్సర్స్ ముందుకు వస్తే మరిన్ని పథకాలతో పాటు ఆథ్లెటిక్స్లో మంచి పేరు సంపాదిస్తుందని, స్పాన్సర్స్ ముందుకు రావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. యువ క్రీడాకారిని ని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అనిత,మాజీ ఉపసర్పంచ్ రమేష్, ముదిరాజ్ కులస్తులు శ్రీనివాస్ లు ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

