- మృతి దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన కిసాన్ పరివార్ టీమ్ సభ్యులు మరియు LHPS నేతలు
- విద్యార్థిని కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలి
- ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకోవాలి వాళ్ళింట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
నేటి సాక్షి మహబూబాద్, నరసింహుల పేట భూక్య రవి :
సీరోల్ మండల కేంద్రంలోని ఈ ఎం ఆర్ ఎస్ పాఠశాలలో డ్యాన్స్ వేస్తూ కుప్పకూలిన రోజా అనే విద్యార్ధిని..చికిత్స నిమిత్తం హాస్పటల్ కి తరలించే లోపు విద్యార్ధిని మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. సభావట్ రోజా తండ్రి వీరు. సభావత్ తండా, తానంచర్ల, మరిపెడ మండలం. మహబూబాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థిని సిరోలు ఈ ఎం ఆర్ ఎస్ పాఠశాలలో సిఇసి మొదటి సంవత్సరం చదువుతుంది. నిన్న మంగళవారం రాత్రి ఈ ఎం ఆర్ ఎస్ సిరోలు పాఠశాలలో వీడ్కోలు పార్టీ సందర్భంగా రాత్రి 8 గంటల సమయంలో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా వారి స్వగ్రామానికి వెళ్లి పార్థోదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన LHPS రాష్ట్ర అద్యక్షులు గుగులోతు భీమా నాయక్,కిసాన్ పరివార్ మరిపెడ మండల కోఆర్డినేటర్ ఎడలి వెంకన్న, వెంకటేశ్వర్లు, సీరియల్ మండల కోఆర్డినేటర్ విష్ణు నాయక్,లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (LS0) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గుగూలోతు శివవర్మ నాయక్ కిసాన్ పరివార్ దంతాలపల్లి మండల కోఆర్డినేటర్ రవి నాయక్, సోమోజి నాయక్ తదితరులు నివాళులర్పించారు.





