నేటి సాక్షి, రామడుగు(పురాణం సంపత్) : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈనెల 18 నుండి 20వ తేదీ వరకు స్టేట్ లెవెల్ హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించగా రామడుగు మండలం వెలిచాల సరస్వతి పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బి హర్షిత్ స్టేట్ లెవెల్ హ్యాండ్ బాల్ పోటీల్లో సత్తా చాటినట్లు స్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన అక్షిత్ ఆటతీరుతో జట్టు గెలుపుకు దోహద పడిందని అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన అక్షిత్ను కరస్పాండెంట్ శ్రీనివాస్, కో కరెస్పాండెంట్ సత్యం, పిఈటి సాయి కృష్ణ అభినందించారు.




