- జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పుల్లూరి స్వప్న సదానందం
నేటి సాక్షి, జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి హోలీ పండుగను పురస్కరించుకొని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పుల్లూరి స్వప్న సదానందం సోమవారం రోజున వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ… హోలీ పండుగను పురస్కరించుకొని తమ కార్యాలయంలో పనిచేస్తున్న తోటి మహిళా సోదరిమణులకు చీరలు పంపిణీ చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని ఉత్తర తెలంగాణలోని రెండో స్థానంలో ఉన్న అతిపెద్ద జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ తను కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, మహిళ సోదరీమణులకు ఏ సమస్యలున్న తన దృష్టికి తీసుకువస్తే రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబుల సహకారంతో తను మార్కెట్ చైర్మన్ ఉన్నంతకాలం మహిళా సోదరీమణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఈ సందర్భంగా చైర్మెన్ పుల్లూరి స్వప్న సదానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయం మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ ఆర్ మల్లేశం, ద్వితీయ శ్రేణి సెక్రెటరీ ఎన్ రాజు మరియు మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.





