నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు): హుజురాబాద్ లో సరోజినీ నాయుడు 146 వ జన్మదినమును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆంగ్ల దినోత్సవoగా ప్రకటించినది. జాతీయ మహిళా దినం మరియు తెలంగాణ రాష్ట్ర ఆంగ్ల దినోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు సాంస్కృతిక, ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించుకొని, ఆమెకు ఘనంగా నివాళులర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇంచార్జి HM రోజా, ఉపాధ్యాయులు అర్చన, శ్రీనివాస్, ఈశ్వర్ రెడ్డి, స్వామీరావు, విజయ, మాధవిలత, శ్రావణి, జమున, శోభరాణి, రాములు, సదానందం పాల్గొన్నారు





