
నేటి సాక్షి, కరీంనగర్ :
జిల్లా కేంద్రంలోని మెహర్నగర్లోని సర్వోదయ సంగీత నిలయం మొదటి వార్షికోత్సవ వేడుకలు విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు విజయ్ కుమార్ విద్యార్థులు తాము నేర్చుకున్న కీబోర్డ్, సంగీతం, సినిమా పాటలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి, విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ సర్వోదయ సంగీత నిలయం స్థాపించిన మొదటి సంవత్సరంలోని 30 కి పైగా విద్యార్థులకు ప్రత్యక్షంగా, ఆన్లైన్ ద్వారా 150 మందికి సంగీతం నేర్పడం గొప్ప వరంగా భావిస్తున్నట్లు చెప్పారు.





