నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి.ఎన్. రమేష్ : కామారెడ్డి జిల్లా మర్కల్ గ్రామం నందు ఉన్న, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల యందు, సూపరిండెంట్ గా విధులు నిర్వహించి, 25 సంవత్సరాలు సత్ప్రవర్తనతో, అంకిత భావంతో విధులు నిర్వహించిన, సతీష్ చంద్ర ను, వివిధ రకాల సేవలు అందించినందుకు గాను, జిల్లా వ్యాప్తంగా, పలు కళాశాలలో పని చేసిన అనుభవం మేరకు, మర్కల్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. సి.శోభారాణి, వైస్ ప్రిన్సిపల్ మీనా, అకాడమిక్ కో ఆర్డినేటర్ వనజ, లతోపాటు కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం, సతీష్ చంద్ర ను సన్మానించి, అభినందనలు తెలియజేశారు.





