- కిడ్నీ బాధితుడికి 10వేల ఆర్థిక సాయం
మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన నిరుపేద నిరుపేద కుటుంబంమైన నజుమా నజీర్ దంపతులు కూలీపని చేస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించు కుంటున్న క్రమంలో పెద్ద కష్టం వచ్చింది. వీరి కుమారుడు సమీర్ పట్టణంలో తన బాల్యం నుంచి పేపర్, పాలు వేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. ఇటీవల సమీరుకు రెండు కిడ్నీలు చెడిపోయి వైద్యం కోసం దాదాపు 12 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో కన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరువిలపిస్తున్నారు. సమీర్ వైద్యానికి మానవత్వంతో సాయం అందించమని కుటుంబ సభ్యులు కోరడంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్టుతో పాటు ఇతర వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేయగా దాతలు స్పందించి సుమారు 9498 రూపాయలు అందించ డంతో ఆదివారం తండ్రి నజీరుకు 10,000/- రూపాయల చెక్కు అందజేయడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు. భాదితుని తండ్రి నజీర్ మాట్లాడుతూ… ట్రస్టు ద్వారా దాతల నుండి విరాళంగా సేకరించి తమ కుమారుడి వైద్యానికి 10,000/- రూ, సాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, గొంగళ్ళ రవికుమార్, నాగుల చంద్రశేఖర్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, పొలాస రాజేందర్, తోట రాజు, సగ్గు రాహుల్ సిన్నన్, వొడ్యాల సందీప్, అక్కనపల్లి పర్శరాం తదితరులు పాల్గొన్నారు.

