
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం రోజున భారతీయ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయ్ పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటగా కళాశాల ప్రిన్సిపాల్ వి. ఆంజనేయ రావు సావిత్రి బాయ్ పూలే ఫోటోకు పూల మాలతో సత్కారం చేసి పూలే గారిని ఆదర్శంగా తీసుకుని ఆడపిల్లలు విద్యార్థి దశ నుండే ధైర్యముగా ఉండి, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా ప్రయత్నం చేసి, జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని ఈ సందర్భముగా తెలిపారు. ఇట్టి కార్యక్రమం లో కళాశాల మహిళా అధ్యాపకులు సుగుణ, రేణుకా, శైలజ, సుహాసిని, రజిత, రజనీ, జ్యోతి, వనమాల, అధ్యాపకులు, విద్యార్థిని-విద్యార్థులు మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

