Monday, March 30, 2026

స్త్రీ విద్య అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే DYFI

నేటి సాక్షి, రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : ఆదర్శమూర్తిని స్త్రీ అభ్యున్నతకై కృషి చేసిందని మహిళామృతులకు సావిత్రిబాయి పూలే ఆదర్శ మూర్తి అని మహిళలు హక్కుల కోసం పోరాడాలని డివైఎఫ్ఐ బద్వేలు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు షేక్ మస్తాన్ షరీఫ్ ఎస్ కే ఆదిల్ తెలిపారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా బద్వేలులోలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జనవరి3 1831 లో జన్మించి మార్చి10 1897లో పూణేలో మరణించింది అన్నారు. ఆమె భర్త గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు. దేశంలో మహిళలకు మొదటి పాఠశాల నిర్మించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. సావిత్రిబాయి పూలే ఒక భారతీయ ఉపాధ్యాయురాలు సామాజిక సంస్కర్త భారత దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అన్నారు. మహారాష్ట్రలో జ్యోతిబాపూలేతో కలిసి భారత దేశంలో మహిళల హక్కులను మెరుగుపరచడంలో ఆమెకిలక పాత్ర పోషించిందన్నారు. ఆమెను భారతదేశ స్త్రీవాదన ఉద్యమానికి మార్గదర్శకరాలిగా భావిస్తారన్నారు.కులం మరియు లింగం ఆధారంగా ప్రజలపై వివేక్షత మరియు అన్యాయమైన ప్రవర్తనను రద్దు చేయడానికి ఆమె ఎంతో కృషి చేసిందన్నారు. అటువంటి గొప్ప మహిళామూర్తి అయిన సావిత్రిబాయి పూలే ని స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.కానీ నేడు దేశంలో మహిళలు, స్త్రీ లు చదువు కోసం గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా దూరం అవుతున్నారు అన్నారు. నిత్యం దాడులు,అత్యాచారాలు దేశంలో ఎక్కువ అయ్యాయని మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. బలమైన చట్టాలు వున్నప్పుడే దోషులకు శిక్షలు పడినప్పుడే మహిళలపై దాడులు, అత్యాచారాలు తగ్గుతాయని అన్నారు. మహిళలు ఉన్నత చదువులు చదివి మార్గదర్శకులు అవ్వాలని దానికి ప్రభుత్వాల సహకారాలు వుండాలని అన్నారు. హక్కుల కోసం మహిళలు సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్ష కార్యదర్శులు ముడమల ఓబుల్ రెడ్డి ఉప్పలూరు బాల గురవయ్య మహిళా కో కన్వీనర్ నాగేశ్వరి షేక్ ఫయాజ్ మహిళా సంఘం అధ్యక్షురాలు అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News