నేటి సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (జక్కుల సందీప్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాహడు మండలం సారపాక పట్టణంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమం బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మహంకాళి రామారావు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1831వ సంవత్సరంలో మహారాష్ట్రలో జన్మించారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణీయ కులతత్వం సంస్కృతి మత వ్యవస్థలపై యుద్ధం ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు పూలే ఆయన భార్య సావిత్ర పూలే భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే,పేద ప్రజలకు ముఖ్యంగా మహిళలకు విద్యాభివృద్ధికయి కృషి చేసినఉద్యమకారిణి సావిత్రిబాయి పూలె కొనియాడారు.స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను జీర్ణించుకోలేక స్త్రీలు విద్యారంగంలో ముందుండాలని గ్రహించి తన భార్య అయిన సావిత్రి బాయి పూలేకు చదువు నేర్పించి ఉపాధ్యాయులుగా చేశారు 1848 పూణే లో మొట్టమొదటిసారిగా పాఠశాలను ప్రారంభించిన ఘనత సావిత్రిబాయి పూలేనని, వితంతువులకు మళ్లీ పెళ్లి చేయించడం బాల్య వివాహాలుఅడ్డుకొని వారికీ విద్య నేర్పించేది 1896-1897కాలంలో ఒకవైపు కరువు మరోవైపు ప్లేగు వ్యాధి రావడంతో పేదలు చాలామంది చనిపోవడం జరిగింది. ప్లేగు వ్యాధి వాళ్ళను దగ్గరకు చేర్చుకొని సేవలు చేసింది.ఆ వ్యాధి ఆమెకు వస్తదని తెలిసినా ఆమెవెనుకడుగు వేయని దీరవనిత.సామాజిక సంస్కృతిక పరివర్తన పోరాటాలకు స్ఫూర్తినిస్తూ మన ఆశయాలను వాస్తవచారణలుగా మార్చుకొనే శక్తిని అందిస్తూ నిరంతర స్ఫూర్తి ప్రదాత గా నిలవటమే సావిత్రి బాయి గొప్పదనం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి బెజ్జంకి కనకాచారి, పినపాక నియోజకవర్గం ఇంచార్జి నిదానపల్లి బాలకృష్ణ బూర్గంపహాడ్ మండల అధ్యక్షులు దాసరి సాంబ, ఉపాధ్యక్షులు చిప్పా రాజు,ప్రధాన కార్యదర్శి మేకల నరసింహరావ్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు బెల్లంకొండ వాసుదేవరావ్, విద్యార్థి సంఘం అధ్యక్షులు జమ్మి సాయిరాం, కార్యదర్శి గోపి, బీసీ నాయకులు ఆరె సతీష్ బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

