నేటిసాక్షి, వీణవంక :
వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి ముద్ధసాని శ్రీనివాసులు తాము అమ్మ ఫౌండేషన్ ద్వారా మరియు వారి రచయితలు, పాటల ద్వారా సమాజానికి చేస్తున్న సేవలు గుర్తించిన అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారు వారి ఐదవ వార్షికోత్సవం మరియు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా తేదీ: 20-01 -2025 సోమవారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతి లోని ఆడిటోరియంలో మాజీ మంత్రివర్యులు DR. V. శ్రీనివాస్ గౌడ్ మరియు ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు DR. S. సరోజనమ్మ చేతుల మీదుగా ఈ అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా గోనెల సమ్మన్న మాట్లాడుతూ మేము చేస్తున్నసేవలకు మమ్మల్ని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసిమాకు సావిత్రిబాయి పూలే జాతీయ ఐకాన్ 2025 అవార్డును ప్రధానం చేసిన DR. S. సరోజనమ్మకు కృతజ్ఞతలు తెలియజేశారు.




