- మహిళా ఉపాధ్యాయినీలకు శాలువాలతో సన్మానం

నేటి సాక్షి,బెజ్జంకి:
భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే 194వ జయంతి వేడుకలు బెజ్జంకి మండలంలో కాంగ్రెస్,సీపీఐ, బీఎస్పీ,దళిత సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే (1831 జనవరి 3 – 1897 మార్చి 10) ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావ్ ఫూలే భార్యగా మాత్రమే కాకుండా, సమాజ మార్పు కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తిగా నిలిచారని,1848లో తన భర్తతో కలిసి పూణేలో మొదటి బాలికల పాఠశాలని ప్రారంభించారు.
సమాజ సేవకురాలు, విద్యావేత్త సావిత్రిబాయి ఫూలే గారని, ఆమె కుల, లింగ వివక్షలను తొలగించడానికి చేసిన కృషిని కొనియాడారు. మహిళ ఉపాధ్యాయినిలకి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శానాగొండ శరత్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, దేవస్థానం చైర్మన్ జెల్ల ప్రభాకర్, పోతు రెడ్డి వెంకట్ రెడ్డి, బోనగం రమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంగెం మధు, బహుజన్ సమాజ్ పార్టీ మానకొండూర్ నియోజకవర్గం ఇంచార్జి నిషాని రాజమల్లు, నియోజకవర్గం అధ్యక్షులు మాతంగి తిరుపతి, బెజ్జంకి మండలం అధ్యక్షులు సావనపల్లి రాజు, దళిత సంఘాల నాయకులు ఎలుక దేవయ్య, చింతకింది పర్శారములు, వడ్లూరి పర్శరాములు, బిగుల్ల మోహన్, మహంకాళి రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

