Tuesday, March 31, 2026

దళిత సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

నేటి సాక్షి, బెజ్జంకి: దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతిని దళిత సంఘాలు మరియు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వడ్లూరి పర్శరాములు ఆధ్వర్యంలో మండలకేంద్రంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఓరుగంటి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే మహిళా విద్య, సామాజిక సమానత్వం, వివక్షల నిర్మూలన కోసం చేసిన పోరాటం చారిత్రాత్మకమని అన్నారు. సవాళ్లను ఎదుర్కొని అణగారిన వర్గాలకు విద్యా సందేశం చాటి, సమాజంలో మార్పు తీసుకువచ్చిన ధీర వనితగా ఆమె నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చింతకింది పర్శరాములు, మంకాల బాలయ్య, కండె మల్లేశం, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొంకటి రాములు, నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు సానగొండ శెరత్, యూత్ అధ్యక్షులు కర్రావుల సందీప్ కుమార్, బీఎస్పీ నాయకులు నిషాని రాజమల్లు, స్వేరో రాష్ట్ర నాయకులు బొర్ర సురేష్ కుమార్, జిల్లా నాయకులు ఉప్పిలేటి బాబు, టౌన్ అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు బోనగిరి కొత్త రాజు, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దొంతర వేణి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News