Thursday, April 2, 2026

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి: చెన్న

  • కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ రిలే నిరవధిక దీక్షలు

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): ఎస్సీ రిజర్వేషన్ల ఏబీసీడీ వర్గీకరణ చట్టబద్ధతకై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి. మండలంలోని రాజరాంపల్లిలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చెన్న కుమార్ ఆద్వర్యంలో చేపడుతున్న రిలే నిరవధిక దీక్షలు మూడవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా చెన్న కుమార్ మాట్లడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు చట్టబద్ధత అమలు చేయకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లతో ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని నిరసిస్తున్నామని, తక్షణమే జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి ఈ మేరకు తాజా రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వ నోటిఫికేషన్లు ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వంను డిమాండ్ చేసారు. దీక్షలో పాల్గొన్న భాజపా ధర్మపురి నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము రాంబాబు, తెలంగాణ ఆర్య వైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం వ్యవస్థపక అధ్యక్షులు సముద్రాల రమేష్ గుప్తా లు సంఘీభావం తెలిపి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అమోదం తెలిపి చట్టబద్దత అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించిన విషయాన్ని వారు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకేనపల్లి సతీష్, సుంకే తిరుపతి, నవీన్, సోషల్ మీడియా కన్వీనర్ వినయ్, శంకరయ్య, రాజేష్, ఎమ్మార్పీఎస్ జగదేవ్ పేట గ్రామ శాఖ అధ్యక్షులు బచ్చల శేఖర్, నాయకులు చెన్న శ్రీనివాస్, బచ్చల సుమన్, స్వామి, మెకానియల్, చిన్న స్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News