- క్యాలెండర్ ఆవిష్కరించిన ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్
నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): తెలంగాణ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య సోమవారం హైదరాబాదులో ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలను కాపాడుకోవడమే అధ్యాపకుల ప్రథమ కర్తవ్యం అని అన్నారు. చదువుల్లో తక్కువ సామర్థ్యం కనబరిచిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు. విద్యార్థులు ఫెయిల్ కాకుండా ఉత్తీర్ణత సాధించేలా పరీక్షలకు సంసిద్ధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ, ఎస్టి గెజిటెడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బరిగల నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంటి రవి,రాష్ట్ర ఉపాధ్యక్షులు హర్షం జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.





