నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : స్కాలర్స్ ప్రీమియర్ లీగ్ 2025 ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ఇన్స్టిట్యూట్ స్టేడియంలో ప్రొఫెసర్ బిద్యాధర్ సుభుదీ, డైరెక్టర్, వరంగల్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పరిశోధక విద్యార్థులు మరియు స్టూడెంట్స్ ఆక్టివిటీ సెంటర్ నిట్ వరంగల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. మొత్తం పది జట్లుగా విభజించిన పరిశోధక విద్యార్థులు ఈ లీగ్‌లో పాల్గొననున్నారు. ఈ టోర్నమెంట్ వచ్చే పది రోజుల పాటు కొనసాగనుంది. “ఇన్స్టిట్యూట్ పరిశోధక విద్యార్థులు ఎస్ ఏ సి తో కలిసి గత 13 సంవత్సరాలుగా స్కాలర్స్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమ నిర్వాహకులను మరియు పాల్గొనే జట్లను అభినందిస్తున్నాం. పరిశోధన మరియు విద్యకు తోడుగా ఫిట్నెస్ బలంగా ఉండటం చాలా ముఖ్యం. అందరూ ‘ఫిట్ గా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి.’ అనే నినాదాన్ని పాటించి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను,” అని తన ప్రసంగంలో ప్రొఫెసర్ బిద్యాధర్ సుభుదీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ డి. శ్రీనివాసాచార్య (డీన్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్), ప్రొఫెసర్ పి. రవికుమార్ (సీనియర్ ప్రొఫెసర్ మరియు స్పోర్ట్స్ సెంటర్ హెడ్), ప్రొఫెసర్ ఎం. హీరాలాల్, డాక్టర్ పి. ప్రశాంత్ (సీనియర్ ఎస్ ఏ సి అధికారి), డాక్టర్ డి. హరి, లు హాజరయ్యారు. ఈ టోర్నమెంట్ సమన్వయ కర్తలుగా పరిశోధక విద్యార్థులు బాలాజీ చౌహాన్ (మెకానికల్ ఇంజినీరింగ్), హరి ప్రసాద్ (కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్), కిషోర్ బాబు (మెకానికల్ ఇంజినీరింగ్), ఓలివ్ (కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్), గణేశ్ గుగ్లోత్ (కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్), మరియు భరత్ (సివిల్ ఇంజినీరింగ్) వ్యవహరిస్తున్నారు.





