

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం, ఎల్లాపూర్ శివారు లో గల ఆర్బిట్ ఇ-టెక్నో పాఠశాల లో మంగళవారం విజ్ఞాన ప్రదర్శన నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలను, నూతన ఆవిష్కరణలు గా మలచాలని, భవిష్యత్తులో వారు గొప్ప శాస్త్ర వేత్తలుగా ఎదిగి, దేశానికి మంచి పేరు తేవాలని ఆశిస్తూ, ఆశీర్వదించారు. నిత్య జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, వాటిని నియంత్రించడానికి పరిష్కార మార్గాలను చూపే విధంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో అందు బాటులో ఉన్న పరికరాలను ఉపయోగించి 100 కు పైగా కొత్త వస్తుకళా ఖండాలు తయారు చేసినట్లు తెలిపారు. ఈ ప్రదర్శన లో రోబో, గడ్డిని కోసే పరికరం, మూత్రపిండాలు పనిచేసే విధానం, వాటర్ ఓవర్ లో అలారం, శ్వాస వ్యవస్థ పరమాణు నిర్మాణం, మినీ చిల్లి కట్టర్, హైడ్రాలిక్ బ్రేక్, ఎయిర్ కూలర్, ఇరిగేషన్, అగ్నిపర్వతం, వాటర్ స్మోకింగ్, రోడ్డు పాన్ హౌస్ మొదలైనవి విద్యార్థిని విద్యార్థులు తయారు చేసినట్లు చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి తెలిపారు. ఈ కార్య క్రమంలో పాఠశాల డైరెక్టర్ సి హెచ్ హారిక-భగవాన్ రెడ్డి, అకాడమిక్ ఇంచార్జ్ వాసుదేవ రెడ్డి, గణిత మరియు సైన్స్ విభాగానికి చెందిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు వెంకటేష్, రంజిత్, వినయ్ కుమార్, ఇంద్రాణి, రాజ్ కుమార్, రూపా దేవి, శ్రీకాంత్, కృష్ణవేణి, శ్వేతా రెడ్డి మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.




