

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : సైన్స్ ఫెయిర్లు విద్యార్థులలో ఉన్న సృజనాత్మక శక్తిని బయటకు తీసే విజ్ఞాన కేంద్రాలని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ గని అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మదర్స్ ల్యాప్ హై స్కూల్ లో మూడు రోజుల పాటు జరిగిన సైన్స్ ఫేర్ వేడుకలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ మూడు రోజుల పాటు ఎంతోమంది విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు సైన్స్ ఫెర్ కు హాజరై విద్యార్థులను అభినందించి ప్రశంసల వర్షం కురిపించారు. చివరి రోజు వనపర్తి జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ గని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రయోగాలను వీక్షించారు. విద్యార్థుల మెడికల్ క్యాంపును సందర్శించి విద్యార్థులందరిని అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం డీ.ఈ.వో మాట్లాడుతూ ఎంతో మంది శాస్త్రవేత్తల కృషి వల్లే ఈరోజు మనం విద్యా, వైద్యరంగం, శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తున్నామని శాస్త్రవేత్తల కృషిని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అబ్దుల్ ముబిన్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.





