Saturday, February 14, 2026

ఎంబీబీఎస్​లో ‘హుదా’ విద్యార్థికి సీటు

  • విద్యార్థిని అభినందించిన పాఠశాల యాజమాన్యం

నేటి సాక్షి, కరీంనగర్: నగరంలోని ఉస్మాన్​పురలో ఉన్న హుదా హైస్కూల్ విద్యార్థిని ఫిల్జా ఫాతిమా నీట్ లో ర్యాంక్ సాధించి, సిరిసిల్ల మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్​సీటు దక్కించుకుంది. బుధవారం హుదా హైస్కూల్ కార్యాలయంలో ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తో పాటు స్కూల్ యాజమాన్యం విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ మాట్లాడుతూ గత 22 ఏండ్లుగా నగరంలో పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తూ, వారి విద్యాపరమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు, అన్ని రకాలుగా తోడ్పాటు నందిస్తున్న హుదా హైస్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. హుదా హైస్కూల్ లో విద్యార్థులకు ఉన్నతమైన క్రమశిక్షణ, మానవతా విలువలను నేర్పిస్తూ.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్ష్య సాధనలో భాగంగా నిష్ణాతులైన ఇంజినీర్లుగా, డాక్టర్లుగా రాణిస్తున్నారని చెప్పారు. ఫిల్జా ఫాతిమా భవిష్యత్తులో మంచి డాక్టర్ గా పేద ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హుదా హైస్కూల్ అధ్యక్షుడు అహ్మద్ అబ్దుల్ అజీమ్, ఉపాధ్యక్షుడు అబ్దుల్ రౌఫ్ ఖాలిద్ లతీఫీ, సెక్రటరీ కరస్పాండెంట్ అబ్దుల్ రబ్ ముజాహిద్ లతీఫీ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News