- రాష్ట్ర దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చిట్టి మల్ల సమ్మయ్య
నేటిసాక్షి/మంగపేట : రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికై గ్రౌండింగ్ అయి అలాగే కలెక్టర్ ఎకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే విధంగా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దళిత బంధు సాధన సమితి పక్షాన స్వాగతిస్తున్నట్లు రాష్ట్రకన్వీనర్ చిట్టిమల్ల సమ్మయ్య తెలిపారు. గత 13 నెలలుగా ప్రభుత్వానికి తమ ఆకాంక్ష తెలిపే విధంగా శాంతియుత మార్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం దానిని గుర్తించి ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి రాష్ట్ర మంత్రి వర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దళిత బంధు లబ్ధిదారులు కూడా అండగా ఉంటారని కాపాడుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతామని తెలిపారు. దయచేసి రెండో విడత ద్వారా ఎంపికైన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి లబ్ధిదారుడికి జిల్లాల కలెక్టర్ల అకౌంట్ లో ఉన్న డబ్బులను తక్షణమే షరతులు లేకుండా వారి అకౌంట్లో జమ చేయాలని చిట్టిమళ్ళ సమ్మయ్య కోరారు. త్వరలోనే రాష్ట్ర బృందం ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మంత్రి మండలికి కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తామని ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వివిధ రాజకీయ పార్టీలకు వివిధ ప్రజా సంఘాలకు మేధావులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చిట్టిమళ్ల సమ్మయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.





